Yashasvi Jaiswal: జైస్వాల్ బాదినా... భారీ స్కోరు సాధించలేకపోయిన రాజస్థాన్

- జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ × రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
- 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసిన రాజస్థాన్
సొంతగడ్డ జైపూర్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారీ ఇన్నింగ్స్ ఆడినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు మాత్రమే చేసింది.
కెప్టెన్ సంజూ శాంసన్ (15) తొందరగానే అవుటైనా... తనదైన శైలిలో దూకుడుగా ఆడిన యశస్వి జైస్వాల్ 47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. జైస్వాల్ ను హేజెల్ వుడ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోయారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
రియాన్ పరాగ్ 30, హెట్మెయర్ 9 పరుగులు చేశారు. ధ్రువ్ జురెల్ 35 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 1, యశ్ దయాళ్ 1, హేజెల్ వుడ్ 1, కృనాల్ పాండ్యా 1 వికెట్ తీశారు.