Royal Challengers Bangalore: డబుల్ హెడర్ లో తొలి మ్యాచ్... టాస్ గెలిచిన ఆర్సీబీ

- ఐపీఎల్ లో ఈ ఆదివారం రెండు మ్యాచ్ లు
- తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ × రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
- జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో మ్యాచ్
ఐపీఎల్ లో ఈ ఆదివారం నాడు రెండు మ్యాచ్ లు (డబుల్ హెడర్) జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... రాత్రి 7.30 గంటలకు మొదలయ్యే రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి.
రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ పోరులో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం బెంగళూరు జట్టులో ఎలాంటి మార్పులు లేవు. రాజస్థాన్ జట్టులోకి మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ తిరిగొచ్చాడు. లెఫ్టార్మ్ పేసర్ ఫజల్ హక్ ఫరూఖీని పక్కనబెట్టారు.
టోర్నీలో ఇప్పటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 5 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు సాధించగా... రాజస్థాన్ జట్టు 5 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు నమోదు చేసింది.