Jr NTR: అభిమానులపై చిరుకోపం ప్రదర్శించిన ఎన్టీఆర్

- 'అర్జున్ సన్‌ఆఫ్ వైజయంతి' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా హజరైన ఎన్టీఆర్
- అభిమానుల కేకలతో ఓకింత అసహనం వ్యక్తం చేసిన ఎన్టీఆర్
- ఇలాగే అరిస్తే వెళ్లిపోతానంటూ అభిమానులను హెచ్చరించిన వైనం
అభిమానులపై ఎన్టీఆర్ చిన్నపాటి అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన సమయంలో అభిమానులు చేసిన హడావుడి ఆయనకు కాస్త కోపం తెప్పించింది.
కల్యాణ్ రామ్‌తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ వేదికపైకి వెళుతుండగా, మూవీ గురించి విజయశాంతి మాట్లాడారు. ఆ సమయంలో అభిమానులు ఎన్టీఆర్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ విజయశాంతి ప్రసంగానికి అడ్డు తగులుతూ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులపై చిన్నపాటి అసహనం ప్రదర్శించారు.
మీరు ఇలాగే అరిస్తే నేను వెళ్లిపోతానంటూ అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ అన్నారు. వెంటనే విజయశాంతి ఎన్టీఆర్ చేయి పట్టుకుని తన పక్కకు తీసుకొచ్చి నిలబెట్టుకున్నారు. అభిమానుల అభిమానం కంట్రోల్ చేయలేకపోతున్నామని విజయశాంతి అన్నారు. అప్పుడు ఎన్టీఆర్ తన అభిమానులకు సైలెంట్‌గా ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు.