Hanuman: భాగ్యనగరంలో ప్రశాంతంగా సాగిన హనుమాన్ శోభాయాత్ర

Peaceful Hanuman Shobha Yatra Concludes in Hyderabad

  • గౌలిగూడ శ్రీరామ ఆలయం నుంచి తాడ్‌బండ్ హనుమానం ఆలయం వరకు శోభాయాత్ర
  • 12 కిలోమీటర్ల మేర సాగిన శోభాయాత్ర
  • 17 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు

భాగ్యనగరంలో హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగింది. గౌలిగూడ శ్రీరామ ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర కోఠి, నారాయణగూడ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, సికింద్రాబాద్ మీదుగా తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయానికి చేరుకుంది. సుమారు 12 కిలోమీటర్ల మేర సాగిన ఈ శోభాయాత్రలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర పోలీసులు 17 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఉంచారు. ఇదిలా ఉండగా, హనుమాన్ శోభాయాత్ర ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కొనసాగుతుండగా ముస్లిం సోదరులు స్వాగతం పలికారు.

Hanuman
Hanuman Shobha Yatra
Hyderabad
Peaceful Procession
Religious Festival
Police Security
Secunderabad
Hindu Festival
Religious event
  • Loading...

More Telugu News