Bhumana Karunakar Reddy: తిరుమల గోశాలలో గోవులు చనిపోయాయన్న భూమనపై ఆనం ఫైర్

- గోవులు చనిపోయాయంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్న ఆనం
- గోశాలలో 230 మంది సిబ్బంది పని చేస్తున్నారని వెల్లడి
- అమ్మ అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి మీ నాయకుడు అని మండిపాటు
తిరుమల గోశాలలో వందకు పైగా గోవులు మరణించాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. భూమన వ్యాఖ్యలను ఆయన ఖండిచారు. టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గోవుల విలువ తెలియని వ్యక్తులు ఈ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు గోవును తల్లిగా భావిస్తారని ఆనం తెలిపారు. తల్లిలాంటి గోవుల పరిస్థితిని సీఎం, డిప్యూటీ సీఎం ప్రతిరోజు పరిశీలిస్తున్నారని చెప్పారు. గోశాలలో అన్ని వసతులు ఉన్నాయని, 230 మంది సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. వయసు పైబడి, అనారోగ్యంతో చనిపోయే ఘటనలను కూడా భూతద్దంలో చూపిస్తున్నారని మండిపడ్డారు. అమ్మ అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి మీ నాయకుడు జగన్ అని అన్నారు. హిందూ ధర్మాన్ని మీ కుటుంబంలో మీరు పాటిస్తున్నారా? అని ప్రశ్నించారు.