A. Rajasekhar Reddy: తెలంగాణ లోకాయుక్తగా రిటైర్డ్ జడ్జి ఎ. రాజశేఖర్ రెడ్డి నియామకం

- ఉప లోకాయుక్తగా జగ్జీవన్ కుమార్ నియామకం
- హెచ్ఆర్సీ చైర్ పర్సన్‌గా షమీమ్ అక్తర్ నియామకం
- నియామక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ లోకాయుక్తగా రిటైర్డ్ జడ్జి ఎ. రాజశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప లోకాయుక్తగా బీ.ఎస్. జగ్జీవన్ కుమార్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్‌గా షమీమ్ అక్తర్ నియమితులయ్యారు. మానవ హక్కుల కమిషన్ సభ్యులుగా శివాడి ప్రవీణ, బి. కిశోర్‌లను ప్రభుత్వం నియమించింది.
దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న మానవ హక్కుల కమిషన్ చైర్మన్, లోకాయుక్త, ఉపలోకాయుక్త పోస్టుల భర్తీ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 5వ తేదీన సచివాలయంలో సమావేశమైన సెలక్షన్ కమిటీ అభ్యర్థుల జాబితాను పరిశీలించి వీరి పేర్లను ఖరారు చేసింది.