Telangana Government: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. కేంద్ర కమిటీకి తెలంగాణ ప్రభుత్వం నివేదిక

- భూములను పరిశీలించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర సాధికారిక కమిటీ
- పరిశీలన జరిపి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయనున్న కేంద్ర కమిటీ
- కేంద్ర సాధికారిక కమిటీతో సమావేశమైన తెలంగాణ అధికారులు
కంచ గచ్చిబౌలి భూములపై కేంద్ర కమిటీకి తెలంగాణ ప్రభుత్వం నివేదిక సమర్పించింది. 400 ఎకరాల భూముల వ్యవహారానికి సంబంధించి పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీతో తెలంగాణ ప్రభుత్వ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు నివేదికను అందజేశారు.
కంచ గచ్చిబౌలిలోని భూములను పరిశీలించేందుకు కేంద్ర సాధికారిక కమిటీ హైదరాబాద్‌కు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. ఈ కమిటీ కంచ గచ్చిబౌలి భూముల్లో పరిశీలన జరిపి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయనుంది.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమావేశమైంది. అంతకుముందు, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు నేతృత్వంలోని బృందం ఒక నివేదికను సమర్పించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కమిటీ సుప్రీంకోర్టుకు అందజేయనుంది.