Sampurnesh Babu: సంపూ హవా మళ్లీ మొదలయ్యేనా?

- గ్యాప్ నిజమేనంటున్న సంపూ
- ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'సోదరా'
- అన్నదమ్ముల ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ
- ఈ నెల 25వ తేదీన విడుదల
చూడటానికి సంపూర్ణేశ్ బాబు చాలా సింపుల్ గా కనిపిస్తాడు. కానీ తెరపైకి వస్తే ఆయనను పట్టుకోవడం చాలా కష్టం. కమెడియన్ గా .. కామెడీ హీరోగా మంచి క్రేజ్ ఉన్నప్పటికీ తన సొంత ఊర్లో ఎప్పటిలా గడపడానికే ఆయన ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. చకచకా సినిమాలు చేసేసి గబగబా నాలుగు రాళ్లు సంపాదించాలనే ఆరాటం .. ఆత్రుత ఆయనలో మనకి కనిపించదు. అలాంటి సంపూకి 'కొబ్బరిమట్ట' తరువాత హిట్ పడలేదనే చెప్పాలి.
సాధారణంగా హీరోగా ఒకటి రెండు ఫ్లాపులు పడగానే, ఎవరైనా సరే కంగారుపడిపోయి కమెడియన్ గా వెనక్కి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి ఒక ఆదుర్దా కూడా మనకి సంపూలో కనిపించదు. అలాంటి సంపూకి ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. అనుకున్న సినిమాలు ప్రమోషన్స్ స్థాయిలో ఆగిపోవడమే అందుకు కారణమని సంపూ నిజాయితీగా చెబుతూ వెళుతున్నాడు. అలాంటి ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'సోదరా' సినిమా సిద్ధమవుతోంది.
