- ఓటీటీ తెరపై రేపు పెరగనున్న సందడి
- అమెజాన్ ప్రైమ్ నుంచి 'చోరీ 2'
- సోనీ లివ్ నుంచి 'ప్రావింకూడు షాపు'
- నెట్ ఫ్లిక్స్ నుంచి రానున్న 'పెరుసు'
రేపు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై సందడి కాస్త గట్టిగానే కనిపిస్తోంది. ఓటీటీ సెంటర్స్ కి రానున్న మూడు సినిమాలు ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వాటిలో 'చోరీ 2' సినిమా ఒకటిగా చెప్పుకోవాలి. నుష్రత్ బరూచా .. సోహా అలీఖాన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి విశాల్ ఫురియా దర్శకత్వం వహించాడు. హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఒక తల్లి తన కూతురును ప్రేతాత్మల బారి నుంచి కాపాడుకోవడానికి చేసిన పోరాటమే ఈ సినిమా కథ.

'నెట్ ఫ్లిక్స్'లో రేపటి నుంచి 'పెరుసు' స్ట్రీమింగ్ కానుంది. వైభవ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, ఇళంగో రామ్ దర్శకత్వం వహించాడు. మార్చి 14న థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమాకి, ఆ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అది ఒక విలేజ్. ఆ విలేజ్ లో ఎంతో గౌరవంగా బతుకుతున్న ఒక పెద్దాయన హఠాత్తుగా చనిపోతాడు. అప్పుడే ఆ కుటుంబ సభ్యులకు ఒక సమస్య వచ్చిపడుతుంది. అదేమిటి? అప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? అనేది కథ.

ఇక రేపటి రోజునే మళయాలం నుంచి 'ప్రావింకూడు షాపు' అనే సినిమా 'సోనీలివ్' లో స్ట్రీమింగ్ కానుంది. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, జనవరి 16న థియేటర్లలో విడుదలైంది. బాసిల్ జోసెఫ్ .. సౌబిన్ షాహిర్ .. చెంబన్ వినోద్ జోస్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఒక వర్షం కురుస్తున్న రాత్రివేళ, కల్లు దుకాణంలో కొంతమంది చిక్కుబడుతారు. తెల్లారేసరికి ఆ దుకాణం యజమాని చనిపోయి ఉంటాడు. ఆయన మరణానికి కారకులు ఎవరు .. ఏమిటి? అనేదే కథ.