Phone Thief Bihar: ఫోన్ దొంగకు భలే శాస్తి జరిగింది... వీడియో ఇదిగో!

రైలు ప్రయాణికులు కిటికీ పక్కన కూర్చుని ఫోన్ మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం. ప్లాట్ ఫాంపై రైలు నిదానంగా కదులుతున్న సమయంలో దొంగలు చటుక్కన ఫోన్ లాగేసుకుని పారిపోతుంటారు. అయితే బీహార్ లో ఓ దొంగ ఇలాంటి ప్రయత్నమే చేయగా, ఆ ప్రయత్నం వికటించింది.
రైలులో ఓ ప్రయాణికుడి నుంచి ఫోన్ ఎత్తుకెళ్లే క్రమంలో, ఆ దొంగ కాస్తా ప్రయాణికుడికి దొరికిపోయాడు. దొంగ చేతిని ప్రయాణికుడు దొరకబుచ్చుకోవడంతో... ఆ దొంగ కిలోమీటరు దూరం పాటు రైలు కిటికీకి వేళ్లాడాడు. ఈ లోపు ప్రయాణికుడు ఆ దొంగ తలపై కొడుతూ... చేస్తావా దొంగతనం? అంటూ చుక్కలు చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.