Tamannaah Bhatia: దెయ్యాల పనిపట్టే మంత్రగత్తె .. ఈ సారి తమన్నా వంతు!

- గతంలో క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన 'ఓదెల రైల్వే స్టేషన్'
- హారర్ థ్రిల్లర్ జోనర్ ను టచ్ చేసిన సీక్వెల్
- కథ .. స్క్రేన్ ప్లే అందించిన సంపత్ నంది
- ఈ నెల 17వ తేదీన సినిమా విడుదల
తమన్నా... గ్లామరస్ రోల్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తూ వచ్చింది. ఆ తరువాత ఆమె నాయిక ప్రధానమైన పాత్రలను పోషిస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే హారర్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలలోను గట్టిగానే కనిపిస్తోంది. అలా ఈ మధ్య వచ్చిన 'అరణ్మనై 4' సినిమాలోనూ దెయ్యంగా ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేసింది. అలాంటి ఆమె ఇప్పుడు దెయ్యాల ఆటకట్టించే మాంత్రికురాలుగా కనిపించనుంది.
తమన్నా మాంత్రికురాలిగా కనిపించే ఆ సినిమా పేరే 'ఓదెల 2'. అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందిన 'ఓదెల రైల్వేస్టేషన్' ... 2022లో థియేటర్స్ కి వచ్చింది. హెబ్బా పటేల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఆ సినిమా, ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాంటి ఆ సినిమాకి ఇది సీక్వెల్. ఆ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా పలకరిస్తే, ఈ సినిమా హారర్ థ్రిల్లర్ గా అలరించనుంది. సంపత్ నంది కథ - స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఇది. ఏప్రిల్ 17వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా నుంచి రీసెంటుగా వదిలిన ట్రైలర్ కొంతవరకూ భయపెట్టిందనే చెప్పాలి. నయనతార... అనుష్క... త్రిష... హన్సిక... దెయ్యం ఆవహించిన పాత్రలను చేశారు. అలాగే తమన్నా కూడా ఈ తరహా పాత్రలలో నటించింది. అయితే దెయ్యంగా కనిపించడం వేరు... దెయ్యాలను మంత్రశక్తితో ఎదిరించే మాంత్రికురాలిగా మెప్పించడం వేరు. సప్తమోక్ష పురాలలో సాధన చేసినట్టుగా చెప్పుకుంటున్న ఈ అందాల మాంత్రికురాలు ఎంతవరకూ భయపెడుతుందనేది చూడాలి.