Delhi Metro: అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఢిల్లీ మెట్రో... మ‌రో వీడియో వైర‌ల్‌!

Delhi Metro Another Viral Video Shows Unruly Behavior
   
అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన‌ ఢిల్లీ మెట్రో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఇటీవ‌ల ఢిల్లీలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న తాలూకు వీడియో ఒక‌టి ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీడియోలో ఓ యువ‌కుడు రైలులో కూర్చొని మ‌ద్యం తాగుతూ ఉడికించిన గుడ్డు తింటూ క‌నిపించాడు. 

ఇత‌ర ప్ర‌యాణికులు చూస్తున్నా అత‌ను మ‌ద్యం సేవించ‌డం ఆప‌లేదు. ఓ వ్య‌క్తి ఈ వీడియోను సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేయ‌డంతో వైర‌ల‌వుతోంది. దీంతో ఈ వీడియోపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. ఇలాంటి వ్య‌క్తుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు.  
Delhi Metro
Viral Video
Drunk Man
Public Intoxication
India News
Delhi
Metro Rail
Social Media
Misbehavior

More Telugu News