Donald Trump: ట్రంప్ హెచ్చరికలను లైట్ గా తీసుకున్న చైనా

- తమపై విధించిన 34 శాతం సుంకాల నిర్ణయాన్ని చైనా వెనక్కి తీసుకోవాలన్న ట్రంప్
- 48 గంటల డెడ్ లైన్ విధించిన వైనం
- అమెరికా బెదిరింపులకు భయపడేది లేదన్న చైనా
చైనా - అమెరికాల మధ్య టారిఫ్ ల యుద్ధం ముదురుతోంది. తమ దేశంపై విధించిన 34 శాతం సుంకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాకు హుకుం జారీ చేశారు. లేనిపక్షంలో చైనాపై అదనంగా 50 శాతం పన్నులు విధిస్తామని హెచ్చరించారు. దీనికి 48 గంటల డెడ్ లైన్ కూడా విధించారు.
ట్రంప్ వార్నింగ్ ను చైనా చాలా లైట్ గా తీసుకుంది. అమెరికా బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేసింది. ఇలాంటి బెదిరింపులు మంచిది కాదని చెప్పింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి లియు పెంగ్యు మీడియాకు తెలిపారు. ట్రంప్ టారిఫ్ ఒత్తిడి, బెదిరింపులకు లొంగబోమని చెప్పారు. చైనా తన చట్టబద్దమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకుంటుందని తెలిపారు.