Samantha Ruth Prabhu: 'ఎక్స్'లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన సమంత

- కొంత కాలంగా సోషల్ మీడియాలో 'ఎక్స్'కు దూరంగా ఉన్న సమంత
- తాజాగా తన నిర్మాణంలో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ను ఎక్స్ లో షేర్ చేసిన వైనం
- సమంత మళ్లీ ఎక్స్ లోకి రావడంపై అభిమానుల సంతోషం
స్టార్ హీరోయిన్ సమంతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కొంత కాలంగా సమంత ఎక్స్ (ట్విట్టర్) కు దూరంగా ఉంటోంది. ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్ బుక్ లోనే యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఎక్స్ వేదికలోకి సామ్ రీఎంట్రీ ఇచ్చింది. ఎక్స్ లో సమంతకు కోటికి పైగా ఫాలోయర్లు ఉన్నారు.
సమంత నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఆమె సొంత ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసుకుంది. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా ఆమె తొలి సినిమా 'శుభం'ను నిర్మించింది. 'శుభం' సినిమాను ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో సమంత నిర్మించింది. ఈ సినిమాకు చెందిన ఫస్ట్ లుక్ ను ఎక్స్ లో సమంత పోస్ట్ చేసింది. హర్రర్ కామెడీ మూవీగా ఈ సినిమా రాబోతోంది. సమంత మళ్లీ ఎక్స్ లోకి రీఎంట్రీ ఇవ్వడంపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.