Telangana MLCs: తెలంగాణలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

- బీజేపీకి చెందిన అంజిరెడ్డి, మల్క కొమురయ్య ప్రమాణం
- ప్రమాణం చేయించిన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
- ముఖ్యమంత్రి సహా పలువురి అండతో తనకు అవకాశం వచ్చిందన్న అద్దంకి దయాకర్
భారతీయ జనతా పార్టీకి చెందిన అంజిరెడ్డి, మల్క కొమురయ్య శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన ఎమ్మెల్సీలతో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, డాక్టర్ కె. లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన అద్దంకి దయాకర్ కూడా శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరుల సహకారంతో తనకు ఈ అవకాశం లభించిందని ఆయన అన్నారు.