Sugali Rama: స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ మృతిపై సీఎం చంద్రబాబు స్పందన

Sugali Ramas Death CM Chandrababu Naidu Responds

  • అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • రెండు కార్లు ఢీకొన్న ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ దుర్మరణం
  • ఈ ఘటన చాలా దురదృష్టకరం అని పేర్కొన్న సీఎం చంద్రబాబు 

అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హంద్రీనీవా ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ దుర్మరణం పాలయ్యారు. రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. 

విధి నిర్వహణలో భాగంగా పీలేరు నుంచి రాయచోటి కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ కు హాజరయ్యేందుకు వెళుతుండగా... సంబేపల్లె మండలం యర్రగుంట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ మరణించడం చాలా దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలిపారు.

Sugali Rama
Andhra Pradesh
Road Accident
Handrineeva Project
Special Deputy Collector
Chandrababu Naidu
Yerraguntla
Kadapa District
AP Politics
Tragic Death
  • Loading...

More Telugu News