Machilipatnam Gold Theft: అటు ఇటు చూసి బంగారు కడియం నొక్కేశాడు... సీసీ కెమెరా వీడియో ఇదిగో!

Machilipatnam Gold Theft Caught on CCTV

 


మచిలీపట్నంలోని ఓ నగల దుకాణంలో చోరీ జరిగింది. ఇది సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. మచిలీపట్నంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దుకాణంలోకి ఓ వ్యక్తి వచ్చాడు. అతడు మాస్క్ ధరించి ఉన్నాడు. నగలు చూస్తున్నట్టు ఏమార్చి, తనను ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకుని ఓ బంగారు కడియాన్ని ఎంతో నేర్పుగా కొట్టేశాడు. 

ఆ దుకాణంలోని సేల్స్ మెన్ ఇతర కస్టమర్లకు నగలు చూపిస్తూ బిజీగా ఉండడంతో, అతడిని ఎవరూ పట్టించుకోలేదు. అయితే, అతగాడి హస్త లాఘవం అంతా సీసీ టీవీ కెమెరాలకు చిక్కింది. 

ఈ ఘటన  రెండ్రోజుల క్రితం జరిగింది. చోరీకి గురైన బంగారు కడియం 30 గ్రాముల బరువు ఉంటుందని తెలుస్తోంది. ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Machilipatnam Gold Theft
Malabar Gold and Diamonds
CCTV Footage
Gold Chain Robbery
Shoplifting
Viral Video
Andhra Pradesh Crime
Jewelry Store Robbery

More Telugu News