Sri Venkateswara Swamy Temple: ఏపీ హైకోర్టులో టీటీడీకి రిలీఫ్

- తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా ఉన్న శ్రీనివాస దీక్షితులు
- తనను తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడిగా బదిలీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్
- టీటీడీ పాలనాపరమైన అంశాల్లో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ ప్రధాన అర్చక పదవి నుంచి తనను తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడిగా బదిలీ చేయాలంటూ పెద్దింటి కుటుంబానికి చెందిన శ్రీనివాస దీక్షితులు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. శ్రీనివాస దీక్షితులు పిటిషన్ పై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు... టీటీడీ పాలనాపరమైన అంశాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. టీటీడీ ఎక్కడ విధులు కేటాయిస్తే అక్కడ ఉద్యోగిగా విధులు నిర్వహించాలని శ్రీనివాస దీక్షితులుకు ఆదేశాలు జారీ చేసింది.