Naveen: మధురవాడలో తల్లీకూతుళ్లపై దాడి చేసిన ప్రేమోన్మాది అరెస్ట్

Madhurawada Murder Lover Arrested

  • శ్రీకాకుళం జిల్లా బుర్జు వద్ద నిందితుడు నవీన్ ను అదుపులోకి తీసుకున్నామన్న విశాఖ సీపీ 
  • దీపిక, నవీన్ లు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారని వెల్లడి
  • ప్రస్తుతం వీరి వివాహానికి పెద్దలు నిరాకరించారని చెప్పిన సీపీ

విశాఖపట్నం మధురవాడలో తల్లీకూతుళ్లపై దాడి చేసిన ప్రేమోన్మాది నవీన్‌ను పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

నిందితుడు నవీన్‌ను శ్రీకాకుళం జిల్లాలోని బుర్జు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశాఖలో బుధవారం సీపీ మీడియాతో కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.

దీపిక, నవీన్‌ల మధ్య గత ఆరు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని, అయితే వారి వివాహానికి ప్రస్తుతం ఆమె ఇంట్లో పెద్దలు నిరాకరించారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే నవీన్.. దీపిక, ఆమె తల్లిపై కత్తితో దాడి చేసి గాయపర్చి పరారయ్యాడన్నారు. ఈ దాడిలో దీపిక తల్లి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన దీపిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు.

అయితే నేరానికి ఉపయోగించిన కత్తిని నవీన్ ఘటనా స్థలంలోనే వదిలివేసి పారిపోయాడని తెలిపారు. ఘటన అనంతరం అతను బైక్‌పై శ్రీకాకుళం వెళ్లిపోయాడని, మధ్యలో ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు దుస్తులు, బైక్ మార్చేశాడని సీపీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఆయన చెప్పారు. 

Naveen
Visakhapatnam
Madhurawada
Murder
Love affair
Arrest
Andhra Pradesh Police
Crime
Deepa
Lakshmi
  • Loading...

More Telugu News