Akash Ambani: శ్రీవారిని దర్శించుకున్న ముఖేశ్ అంబానీ తనయుడు ఆకాశ్

- వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్న ఆకాశ్ అంబానీ
- దర్శనం అనంతరం వేదాశీర్వచనం అందించిన అర్చకులు
- గోపూజ చేసి గోమాతకు దాణా అందించిన ఆకాశ్ అంబానీ
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు.
ఉదయం ఆలయానికి చేరుకున్న ఆకాశ్‌కు అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆకాశ్ అంబానీ తిరుమలలోని ఎస్వీ గోశాలను సందర్శించారు. గోపూజ చేసి గోమాతకు దాణా అందించారు.