Central Government: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం

Central Government Responds to Kancha Gachibowli Land Issue
  • కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలన్న కేంద్రం
  • అటవీ చట్టానికి లోబడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం
  • వాస్తవ నివేదిక వివరాలను, తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో ఇవ్వాలన్న కేంద్రం
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి ప్రాంతంలో గల భూముల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 400 ఎకరాల భూములను పరిరక్షించాలంటూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని బీజేపీ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో సైతం లేవనెత్తారు.

కంచ గచ్చిబౌలి భూములపై వాస్తవ నివేదికను పంపాల్సిందిగా తెలంగాణ అటవీ శాఖను తాజాగా కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది.

ఈ నేపథ్యంలో న్యాయస్థానాల తీర్పులను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని, అటవీ చట్టాలకు లోబడి చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని ఈ భూమికి సంబంధించిన వాస్తవ నివేదిక వివరాలను, తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో సమర్పించాలని కేంద్రం పేర్కొంది.
Central Government
Kancha Gachibowli Land
HCU
Telangana Government
Forest Land
BJP MPs
Parliament
Land Dispute
400 Acres
Hyderabad

More Telugu News