Home Town Series: మిడిల్ క్లాస్ ఆశల చుట్టూ తిరిగే 'హోమ్ టౌన్' .. ఓటీటీలో!

Home Town Series Update

  • మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథ 
  • ప్రధాన పాత్రల్లో రాజీవ్ కనకాల - ఝాన్సీ - ప్రజ్వల్ 
  • సంగీత దర్శకుడిగా సురేశ్ బొబ్బిలి 
  • ఈ నెల 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్


 చాలామంది పిల్లలు ఫారిన్లో చదవడానికి ఆసక్తిని చూపుతుంటారు. చదువు పూర్తి చేసి అక్కడే జాబ్ సంపాదించి .. అక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకుంటారు. తమ పిల్లలు ఫారిన్లో ఉన్నారని గొప్పగా చెప్పుకోవాలనే పేరెంట్స్ కూడా ఎక్కువ మందే కనిపిస్తూ ఉంటారు. కానీ కొంతమంది పిల్లలు మాత్రం తల్లిదండ్రుల దగ్గర ఉండటానికే ఇష్టపడుతూ ఉంటారు. పుట్టి పెరిగిన ఊరుకు దూరం కావడం కంటే దురదృష్టం లేదనుకుంటారు. 

అయితే తమ కొడుకు ఫారిన్ వెళ్లాలనే బలమైన కోరిక తల్లిదండ్రులకు ఉంటే .. కన్నవాళ్ల దగ్గరే ఉండిపోవాలనే ఒక ఆలోచన ఆ కొడుక్కి అంతే బలంగా ఉంటే ఏం జరుగుతుందనేది ఊహించడం కష్టమే. అలాంటి ఒక కాన్సెప్ట్ తో రూపొందిన సిరీస్ 'హోమ్ టౌన్'. ఈ టైటిల్ తో రూపొందిన ఈ సిరీస్ లో రాజీవ్ కనకాల .. ఝాన్సీ .. ప్రజ్వల్ ప్రధానమైన పాత్రలను పోషించారు. 

ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే ఒక ఆసక్తికరమైన కథ ఇది. వాళ్ల ఆలోచనలు .. ఆశలు ఎలా ఉంటాయనేది ప్రతిబింబించే సిరీస్ ఇది. 2000 సంవత్సరం నేపథ్యంలో ఈ కథ నడుస్తూ ఉంటుంది. శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కి సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చాడు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూడాలి మరి. 



Home Town Series
Aha Video Series
Rajeev Kanakala
Jhansi
Prajwal
Telugu Web Series
Srikanth Director
Suresh Bobbili Music
Middle Class Family Story
Family Drama
  • Loading...

More Telugu News