Sunrisers Hyderabad: హెచ్‌సీఏ, సన్ రైజర్స్ హైదరాబాద్ వివాదం ముగిసింది!

Sunrisers Hyderabad HCA Resolve Complementary Ticket Dispute
  • మంగళవారం నాడు భేటీ అయిన హెచ్‌సీఏ, ఎస్ఆర్‌హెచ్ ప్రతినిధులు
  • ఒప్పందం ప్రకారం 10 శాతం టిక్కెట్లు ఇస్తామన్న సన్ రైజర్స్ హైదరాబాద్
  • టిక్కెట్ల కేటాయింపు యథావిధిగా కొనసాగుతుందని ఎస్ఆర్‌హెచ్ సీఈవో హామీ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ), సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) మధ్య ఉప్పల్ స్టేడియం కాంప్లిమెంటరీ టిక్కెట్ల వివాదం సద్దుమణిగింది. ఇరువైపుల ప్రతినిధులు మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఒప్పందం ప్రకారం 10 శాతం టిక్కెట్లు కేటాయిస్తామని సన్ రైజర్స్ హైదరాబాద్ స్పష్టం చేసింది.

గతంలో మాదిరిగానే అన్ని కేటగిరీల్లో పాసులు ఇవ్వాలని హెచ్‌సీఏ కోరింది. సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవో షణ్ముగంతో ఇరువర్గాల ప్రతినిధులు టెలిఫోన్‌లో సంభాషించారు. టిక్కెట్ల కేటాయింపు యథావిధిగా కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. దీంతో టిక్కెట్ల వివాదానికి ముగింపు పలికినట్లయింది.

సమస్య పరిష్కారమైన అనంతరం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు స్పందించారు. తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, హెచ్‌సీఏ ప్రతినిధులు వెంటనే స్పందించి పరిష్కార దిశగా చర్యలు చేపట్టారని, వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. మనమందరం కలిసి ఉప్పల్‌లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.
Sunrisers Hyderabad
HCA
IPL Tickets
Hyderabad Cricket Association
Complementary Tickets Dispute
Uppal Stadium
Jagan Mohan Rao
Revanth Reddy
Telangana Government
SRH CEO Shanmugam

More Telugu News