TDP: రేపు లోక్ సభ ముందుకు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు... తమ ఎంపీలు తప్పనిసరిగా హాజరు కావాలన్న టీడీపీ

TDP Supports Waqf Amendment Bill

  • వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు టీడీపీ మద్ధతు 
  • తమ ఎంపీలందరూ సభలోనే ఉండాలని విప్ జారీ చేసిన టీడీపీ
  • 3 లైన్ల విప్ జారీ చేసిన టీడీపీ చీఫ్ విప్ హరీశ్ బాలయోగి

వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన టీడీపీ మద్దతు ప్రకటించింది. రేపు లోక్ సభకు తప్పనిసరిగా హాజరుకావాలని, సభలోనే ఉండాలని తమ ఎంపీలందరికీ టీడీపీ విప్ జారీ చేసింది. టీడీపీ చీఫ్ విప్ హరీశ్ బాలయోగి 3 లైన్ల విప్ జారీ చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రేపు పార్లమెంటు ముందుకు వస్తున్న నేపథ్యంలో టీడీపీ నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కారు ఈ బిల్లును రేపు లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ఎల్లుండి రాజ్యసభలో చర్చ జరగనుంది. ఈ కీలక బిల్లుపై ఉభయ సభల్లో చర్చకు 8 గంటల సమయం కేటాయించారు. అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా రేపు, ఎల్లుండి తప్పనిసరిగా పార్లమెంటుకు హాజరు కావాలని తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.

TDP
Waqf Amendment Bill
Parliament
Lok Sabha
Rajya Sabha
BJP
Congress
Harish Balayogi
NDA
Modi Government
  • Loading...

More Telugu News