Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు

- ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఈ నెల 15 వరకు రిమాండ్
- ఉత్తర్వులు వెలువరించిన గన్నవరం కోర్టు
- ఇప్పటికే మరో రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న వంశీ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఏప్రిల్ 15 వరకు రిమాండ్ పొడిగిస్తూ గన్నవరం కోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఓ భూ వివాదంలో పోలీసులు వంశీపై కేసు నమోదు చేయడం తెలిసిందే. తన భూమిని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారంటూ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీని ఇప్పటికే పోలీసులు ఒక రోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.
వల్లభనేని వంశీ అటు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్ ను కిడ్నాప్ చేసిన బెదిరించిన కేసులోనూ నిందితుడిగా ఉన్నారు.