Punjab Kings: వాజ్ పేయి స్టేడియంలో పంజాబ్ కింగ్స్ × లక్నో సూపర్ జెయింట్స్... టాస్ అప్డేట్ ఇదిగో!

Punjab Kings vs Lucknow Super Giants Toss Update

  • ఐపీఎల్ లో ఆసక్తికర మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
  • మ్యాచ్ విన్నర్లతో బలంగా కనిపిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ 

ఐపీఎల్ లో ఇవాళ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు లక్నోలోని వాజ్ పేయి స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తాజా సీజన్ లో పంజాబ్ ఇప్పటివరకు ఒక మ్యాచ్ ఆడి, అందులో విజయం నమోదు చేసింది. ఇవాళ కూడా గెలవాలని కృతనిశ్చయంతో ఉంది. 

అటు, లక్నో జట్టు రెండు మ్యాచ్ లు ఆడి ఒక దాంట్లో గెలిచి, మరో దాంట్లో ఓడింది. గత  మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై నెగ్గిన లక్నో సూపర్ జెయింట్స్ అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబరిచింది. అదే ఆత్మవిశ్వాసంతో నేటి మ్యాచ్ లో బరిలో దిగుతోంది. మిచెల్ మార్ష్, మార్క్రమ్, నికోలాస్ పూరన్, పంత్, డేవిడ్ మిల్లర్ వంటి డైనమిక్ బ్యాటర్లతో... శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ వంటి టాలెంటెడ్ బౌలర్లతో లక్నో బలంగా కనిపిస్తోంది.

పంజాబ్ కింగ్స్
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్యా, ప్రభ్ సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్, మార్కస్ స్టొయినిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, సుయాన్ష్ షెడ్గే, మార్కో యన్సెన్, లాకీ ఫెర్గుసన్, యుజువేంద్ర చహల్, అర్షదీప్ సింగ్.

లక్నో సూపర్ జెయింట్స్ 
రిషబ్ పంత్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్, నికోలాస్ పూరన్, ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.

Punjab Kings
Lucknow Super Giants
IPL 2024
Cricket Match
Vazpayee Stadium
IPL
T20
Shreyas Iyer
Rishabh Pant
Match Highlights
  • Loading...

More Telugu News