Donald Trump: ట్రంప్ ఎఫెక్ట్.. ఏకంగా 1,390 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

Sensex Down 1390 Points

  • ప్రతీకార సుంకాలపై రేపు నిర్ణయాన్ని ప్రకటించనున్న ట్రంప్
  • ప్రపంచ వ్యాప్తంగా ఒడిదుడుకులకు గురవుతున్న మార్కెట్లు
  • 353 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేపు తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. మన మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. ఐటీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. 

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,390 పాయింట్లు పతనమై 76,024కి పడిపోయింది. నిఫ్టీ 353 పాయింట్లు కోల్పోయి 23,165కి దిగజారింది.  

బీఎస్ఈ సెన్సెక్స్ లో ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.11%), జొమాటో (0.27%) లాభపడ్డాయి. హెచ్చీఎల్ టెక్నాలజీస్ (-3.87%), బజాజ్ ఫిన్ సర్వ్ (-3.46%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-3.35%), బజాజ్ ఫైనాన్స్ (-2.81%), ఇన్ఫోసిస్ (-2.73%) టాప్ లూజర్లుగా ఉన్నాయి.

Donald Trump
Sensex crash
Nifty fall
Stock market crash
US tariffs
Indian stock market
IT stocks
Market volatility
Trump effect on Indian markets
BSE Sensex
  • Loading...

More Telugu News