Nidadavolu Municipality Chairman Election: నిడదవోలులో జనసేన వర్సెస్ వైసీపీ... తీవ్ర ఉత్కంఠ!

Nidadavolu Municipality JanaSena vs YSRCP

  • నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సహా జనసేనలో చేరిన పలువురు కౌన్సిలర్లు
  • ఎక్స్ అఫీషియో సభ్యులుగా పురందేశ్వరి, కందుల దుర్గేశ్, సోము వీర్రాజు
  • ఛైర్మన్ పదవి కోసం జనసేన, వైసీపీ మధ్య తీవ్ర పోటీ

ఇప్పటికే పలు మున్సిపాలిటీలు వైసీపీ చేజారాయి. తాజాగా నిడదవోలు మున్సిపాలిటీ ఛైర్మన్ అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. నిడదవోలు మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి జనసేన, వైసీపీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. 

2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నిడదవోలులోని మొత్తం 28 వార్డులకు గాను 27 చోట్ల వైసీపీ గెలుపొందింది. ఒక చోట టీడీపీ గెలిచింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సహా ఏడుగురు కౌన్సిలర్లు జనసేనలో చేరారు. తాగాజా మరో ఇద్దరు కౌన్సిలర్లు కూడా జనసేనతో కలిశారు. దీంతో, టీడీపీతో కలిసి జనసేన బలం 12కు పెరిగింది. వైసీపీ బలం 16కు తగ్గింది. 

జనసేనకు 12 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి, నిడదవోలు ఎమ్మెల్యే, ఏపీ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఛైర్మన్ పదవికి జనసేన, వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 

Nidadavolu Municipality Chairman Election
JanaSena
YSRCP
Andhra Pradesh Local Body Elections
Political Heat
Nidadavolu
K Kandula Durga Prasad
Puranadeswari
Somu Veeraju
TDP
  • Loading...

More Telugu News