Mani Sharma: హెచ్‌సీయూ భూముల వివాదం... నిరసనకు మద్దతు తెలిపిన సంగీత దర్శకుడు మణిశర్మ

- రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్ గా హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం
- ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన
- ఈ ఆందోళనకు తాజాగా రాజకీయ పార్టీలు తోడైన వైనం
- తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ నిరసన
హెచ్‌సీయూ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదేపిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు తాజాగా రాజకీయ పార్టీలు తోడవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
ఈ క్రమంలో హెచ్‌సీయూ భూముల విషయంలో తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు కేబీఆర్ పార్క్ వద్ద హెచ్‌సీయూ భూముల విషయంలో బీఆర్ఎస్‌వీ నిరసన వ్యక్తం చేయగా, చెట్లను రక్షించండి అనే ఫ్లకార్డులను చేతబట్టి వారికి మణిశర్మ మద్దతు తెలియజేశారు.