Flat stomach: సాయంత్రం 6 తర్వాత ఈ 6 పదార్థాలను దూరం పెడితే పొట్ట రాదట!

6 Foods to Avoid After 6 PM for a Flat Stomach
––
బాన పొట్ట భయం మిమ్మల్ని వెంటాడుతోందా.. నోరు కట్టేసుకున్నా, గంటల తరబడి కసరత్తులు చేసినా పొట్ట కరగడం లేదా? అయితే, దానికి కారణం రాత్రిపూట మీ తిండి అలవాట్లేనని న్యూట్రీషనిస్టులు చెబుతున్నారు. పొట్ట రాకుండా ఉండాలన్నా.. వచ్చిన పొట్టను కరిగించుకోవాలన్నా సాయంత్రం ఆరు దాటాక ఈ ఆరు ఆహార పదార్థాల వైపు చూడొద్దని సూచిస్తున్నారు. తీపి పదార్థాలు, కూల్ డ్రింక్స్, హై ప్రొటీన్ పదార్థాలు, పాల ఉత్పత్తులు, రిఫైన్డ్ కార్బొహైడ్రేట్లు, డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలు పగటి పూట తినడం మంచిదని, రాత్రిళ్లు వాటి జోలికి వెళ్లొద్దని సలహా ఇస్తున్నారు. దీనివల్ల మీ పొట్ట ఫ్లాట్ గా మారుతుందని వివరించారు.

షుగరీ ఫుడ్స్
కేకులు, బిస్కెట్లు, చాక్ లెట్లలో క్యాలరీలు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట వీటిని తినడం వల్ల కొవ్వు పేరుకుపోయి పొట్ట వస్తుందని హెచ్చరిస్తున్నారు. అధిక బరువుకూ ఇదే కారణమవుతుందన్నారు.
 
హెవీ ప్రొటీన్స్
ప్రొటీన్లు ఆరోగ్యకరమనే విషయం అందరికీ తెలిసిందే. కానీ రాత్రిపూట హై ప్రొటీన్ ఉండే మటన్ వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే జీర్ణం కావడం కష్టమని నిపుణులు చెప్పారు. దీనివల్ల నిద్రకు దూరమయ్యే పరిస్థితి కూడా ఎదురవుతుందన్నారు. రాత్రిపూట మాంసాహారం తినదల్చుకుంటే చికెన్, గుడ్లు తీసుకోవడం కొంత మేలని వివరించారు.
 
కార్బొనేటెడ్ డ్రింక్స్
కూల్ డ్రింక్స్, సోడా, బీర్ వంటి కార్బొనేటెడ్ డ్రింక్స్ వల్ల పొట్టలో గ్యాస్ తయారవుతుందని నిపుణులు హెచ్చరించారు. దీంతో పొట్ట పెరగడం ఖాయమని చెప్పారు. ముఖ్యంగా రాత్రిపూట ఈ పానీయాలను దూరం పెట్టడం ఉత్తమమని సూచిస్తున్నారు.

డెయిరీ ఉత్పత్తులు
రాత్రి పూట పాలు తాగడం, వెన్న, యోగర్ట్, పాలతో తయారుచేసిన క్రీములను తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధింత సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొట్ట పెరగడానికి కారణమవుతాయని చెప్పారు. సాయంత్రం ఆరు తర్వాత వీటిని తీసుకోవద్దని సూచిస్తున్నారు.
 
రిఫైన్డ్ కార్బొహైడ్రేట్లు
అన్నం, పాస్తా, బ్రెడ్ వంటి పదార్థాలంటే ఎంతగా ఇష్టం ఉన్నప్పటికీ రాత్రిపూట వాటిని తీసుకోవద్దని నిపుణులు చెప్పారు. ఈ పదార్థాల వల్ల ఇన్సులిన్ స్థాయులు పెరిగి పొట్ట వస్తుందని హెచ్చరించారు.
 
డీప్ ఫ్రైడ్ ఫుడ్స్
పకోడీలు, కచోరీ, సమోసాలతో పాటు వేపుళ్లకు డిన్నర్ లో చోటివ్వకుండా జాగ్రత్త పడితే మీ పొట్ట ఫ్లాట్ గా ఉంచుకోవచ్చని నిపుణులు తెలిపారు. నూనెలో బాగా వేయించిన పదార్థాలలో క్యాలరీలు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయని, ఇవి మీ జీర్ణక్రియను మందగించేలా చేస్తాయని వివరించారు. ఫలితంగా పొట్టలో కొవ్వు పేరుకుపోతుందని, తరచూ రాత్రిపూట వీటిని తీసుకుంటే పొట్ట రావడం ఖాయమని హెచ్చరించారు.
Flat stomach
Nutritionists
Weight loss
Sugary foods
High protein foods
Dairy products
Refined carbohydrates
Deep fried foods
Evening snacks
Healthy eating habits

More Telugu News