China: బ్యాంకాక్ లో కూలిన 30 అంతస్తుల బిల్డింగ్ శిథిలాల నుంచి డాక్యుమెంట్లు ఎత్తుకెళుతూ పట్టుబడిన చైనా పౌరులు

China Railway Group Involved in Bangkok Building Collapse

  • బిల్డింగ్ నిర్మించింది చైనా కంపెనీయే.. తాజా అరెస్టులతో నాణ్యతపై సందేహాలు
  • విచారణకు ఆదేశించిన ప్రధాని షినవత్ర
  • నాసిరకం స్టీల్ తో నిర్మాణం జరిపినట్లు పరీక్షల్లో వెల్లడి

మయన్మార్, థాయ్ లాండ్ లను ఇటీవల పెను భూకంపం వణికించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. చుట్టుపక్కల భవనాలకు పెద్దగా నష్టం వాటిల్లకపోయినా ఈ భనవం మాత్రం శిథిలాల దిబ్బగా మారిపోయింది. ఈ భారీ టవర్ ను చైనా కంపెనీ నిర్మిస్తోంది. సదరు కంపెనీలో చైనా రైల్వే గ్రూప్ కు వాటా ఉండడం గమనార్హం. కాగా, బిల్డింగ్ కూలిన ప్రాంతం నుంచి డాక్యుమెంట్లు తీసుకెళుతున్న నలుగురు చైనా పౌరులను బ్యాంకాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అవసరమైన పత్రాలు తీసుకెళుతున్నామని వారు చెబుతున్నారని తెలిపారు.

అయితే, కూలిన బిల్డింగ్ ను నిర్మించింది చైనా కంపెనీ కావడంతో ఈ డాక్యుమెంట్ల తరలింపుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, భారీ భవనం కూలిన ఘటనపై థాయ్ లాండ్ ప్రధాని షినవత్ర స్పందించారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రధాని ఆదేశాల మేరకు కూలిన శిథిలాల నుంచి స్టీల్ సేకరించి పరీక్షలు జరపగా.. బిల్డింగ్ నిర్మాణంలో ఉపయోగించిన స్టీలు నాసిరకమైనదని తేలినట్లు అధికారులు వివరించారు. భూకంపం ధాటికి బిల్డింగ్ కుప్పకూలడానికి ఈ నాసిరకం స్టీలు కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. బిల్డింగ్ ప్లాన్ లోనూ పలు లోపాలు ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ నేపథ్యంలో దర్యాప్తు జరిపి అసలు కారణం తెలుసుకుంటామని థాయ్ లాండ్ అంతర్గత వ్యవహారాల మంత్రి అనుతిన్ చార్న్ విరాకుల్ పేర్కొన్నారు. భవనం కూలిపోయిన సమయంలో నిర్మాణ పనుల్లో నిమగ్నమైన 19 మంది మరణించారని, మరో 75 మంది ఆచూకీ తెలియడంలేదని బ్యాంకాక్ గవర్నర్ మీడియాకు వివరించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

China
Bangkok building collapse
Thailand
30-story building
China Railway Group
Shocking incident
Investigation
Low-quality steel
Building collapse
Insurance claim
  • Loading...

More Telugu News