Ashwani Kumar: అరంగేట్రంలోనే అశ్వని కుమార్ అదుర్స్... కేకేఆర్ 116 ఆలౌట్

- వాంఖెడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ × కోల్ కతా నైట్ రైడర్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
- 16.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయిన కేకేఆర్
ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న ముంబయి ఇండియన్స్ బౌలర్ అశ్వని కుమార్ అద్భుత బౌలింగ్ చేయడంతో కోల్ కతా రైట్ రైడర్స్ కుప్పకూలింది. ముంబయి వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఎంఐ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ 16.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది.
23 ఏళ్ల లెఫ్టార్మ్ పేసర్ అశ్వని కుమార్ ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ముంబయి తుది జట్టులో స్థానం దక్కించుకున్న అశ్వని కుమార్ 24 పరుగులు ఇచ్చి 4 కీలకమైన వికెట్లు తీశాడు. కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే (11) వికెట్ తో పాటు రింకూ సింగ్ (17), మనీశ్ పాండే (19), ఆండ్రీ రసెల్ (5) వంటి హార్డ్ హిట్టర్లను కూడా అశ్వని కుమార్ బోల్తా కొట్టించాడు.
మరో ఎండ్ లో దీపక్ చహర్ 2, ట్రెంట్ బౌల్ట్ 1, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 1, విఘ్నేశ్ పుతూర్ 1, మిచెల్ శాంట్నర్ 1 వికెట్ తీశారు. కోల్ కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ లో ఆంగ్ క్రిష్ రఘువంశి 26, రమణ్ దీప్ సింగ్ 22 పరుగులు చేశారు. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (1), సునీల్ నరైన్ (0) చెత్తగా ఆడి అవుటయ్యారు. వెంకటేశ్ అయ్యర్ 3 పరుగులు చేసి నిరాశరపరిచాడు.