Bandi Sanjay: ఎంఎంటీఎస్ బాధితురాలిని పరామర్శించిన బండి సంజయ్.. రేవంత్ పై విమర్శలు

Bandi Sanjay Visits MMTS Victim Criticizes Revanth Reddy

  • ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం
  • యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
  • ఇంతవరకు నిందితుడిని పట్టుకోలేదంటూ బండి సంజయ్ మండిపాటు

ఎంఎంటీఎస్ రైల్లో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తనను తాను రక్షించుకునే క్రమంలో బాధితురాలు రైలు నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో గాయపడ్డ బాధితురాలు ప్రస్తుతం హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. 

అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ... ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు నిందితుడిని పట్టుకోలేదని విమర్శించారు. నిందితుడిని పట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని... పోలీసులేమో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నిందితుడిని పట్టుకున్నామని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ చెప్పడం సిగ్గుచేటని అన్నారు. తక్షణమే నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని అన్నారు. 

Bandi Sanjay
MMTS victim
Rape attempt
Hyderabad
Yashoda Hospital
Revanth Reddy
Telangana Politics
Crime
Police investigation
Justice for victim
  • Loading...

More Telugu News