Sardar 2: కార్తి నట విశ్వరూపం... 'సర్దార్ 2' ప్రోలాగ్ వీడియో చూశారా..?

- కార్తి, పీఎస్ మిత్రన్ కాంబోలో 'సర్దార్ 2'
- 2022లో వచ్చిన స్పై, యాక్షన్ థ్రిల్లర్ సర్దార్‌కు సీక్వెల్
- ఈసారి విలన్‌గా ప్రముఖ నటుడు ఎస్‌జే సూర్య
2022లో కార్తి హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన స్పై, యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా 'సర్దార్ 2' వస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ 'ప్రోలాగ్' పేరిట ఓ వీడియోను విడుదల చేశారు.
ప్రముఖ నటుడు ఎస్‌జే సూర్యను ప్రతినాయకుడిగా పరిచయం చేస్తూ ఈ వీడియోను పంచుకున్నారు. ఇక ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. కార్తి సరసన హీరోయిన్లుగా ఆషిక రంగనాథ్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు.