Vladimir Putin: మంటల్లో కాలిపోయిన పుతిన్ లగ్జరీ కారు!

Putins Luxury Car Engulfed in Flames in Moscow

  • మాస్కోలోని లుబ్యంకాలో ఉన్న జాతీయ భద్రతా సర్వీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఘటన
  • పుతిన్ పై హత్యాయత్నం జరిగిందా అనే అనుమానాలు
  • ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేసిన కొద్దిరోజులకే ఈ ఘటన

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వినియోగించే అత్యంత ఖరీదైన లిమోజీన్ కారు అగ్ని ప్రమాదంలో కాలిపోవడం తీవ్ర కలకలం రేపింది. మాస్కోలో చోటు చేసుకున్న ఈ ఘటన అధ్యక్షుడి భద్రతపై పలు అనుమానాలను కలిగిస్తోంది. పుతిన్‌పై హత్యా ప్రయత్నం జరిగిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన ప్రపంచ దేశాధినేతలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

రష్యా మీడియా కథనాల ప్రకారం.. మాస్కోలోని లుబ్యంకాలో ఉన్న జాతీయ భద్రతా సర్వీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఈ నెల 29న తొలుత పేలుడు సంభవించింది. ఆ తర్వాత అధ్యక్షుడు పుతిన్ ఉపయోగించే అరస్ లిమోజీన్ కారు మంటల్లో చిక్కుకుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు సమీపంలోని రెస్టారెంట్ సిబ్బంది కారుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.

ఇంజిన్ నుంచి వచ్చిన మంటలు కారు మొత్తానికి వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ సందర్భంగా భారీగా పొగ వ్యాపించింది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. అయితే, ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రష్యన్ మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు చేస్తోంది.

ఇదిలా ఉండగా, పుతిన్ అనారోగ్యంతో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆయన త్వరలో మరణిస్తారని, ఆ తర్వాత యుద్ధం ఆగిపోతుందని అన్నారు. ఐరోపా జర్నలిస్టులతో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. 

Vladimir Putin
Putin's Limousine
Moscow
Russia
Car Fire
Explosion
National Security Service
Presidential Estate Department
Ukraine
Zelenskyy
  • Loading...

More Telugu News