Vodafone Idea: వొడాఫోన్ ఐడియాలో మరింత పెరగనున్న కేంద్ర ప్రభుత్వ వాటా

Vodafone Idea Government to Increase Stake

  • ప్రభుత్వానికి దాదాపు 37వేల కోట్ల విలువైన షేర్లు జారీ చేసిన వోడాఫోన్ ఐడియా
  • వీఐలో 49 శాతానికి పెరగనున్న ప్రభుత్వ వాటా

రుణ భారంతో కుదేలైన మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా (విఐ)లో వాటాను పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికే కంపెనీలో 22.6 శాతం వాటాతో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా ఉండగా, కంపెనీ బకాయిపడిన స్పెక్ట్రమ్ వేలం మొత్తాన్ని తన వాటాగా మార్చుకోనుంది.

ఈ క్రమంలో ప్రభుత్వం దాదాపు రూ.37 వేల కోట్ల విలువైన షేర్లను సొంతం చేసుకోనుంది. దీంతో కంపెనీలో ప్రభుత్వ వాటా 48.99 శాతానికి బలపడనున్నట్లు వొడాఫోన్ ఐడియా తాజాగా పేర్కొంది. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రభుత్వం వెల్లడించింది.

సెప్టెంబర్ 2021 టెలికాం రంగ సంస్కరణలు, మద్దతు ప్యాకేజీకి అనుగుణంగా వేలం బకాయిలను ఈక్విటీ షేర్లుగా మార్చుకునేందుకు నిర్ణయించినట్లు టెలికాం మంత్రిత్వ శాఖ ఫైలింగ్‌లో వెల్లడించింది. 

Vodafone Idea
Indian Government
Telecom Sector
Spectrum Auction
Government Stake
Equity Shares
Debt Burden
Telecom Reforms
Vodafone Idea Shares
Mobile Telecom
  • Loading...

More Telugu News