Kotireddy: సజీవ సమాధికి వ్యక్తి యత్నం.. అడ్డుకున్న పోలీసులు

Prakasam Police Stop Live Burial Attempt

  • ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఘటన
  • ఆలయం ముందు గొయ్యి తీసి వారం రోజులుగా అందులో ధ్యానం
  • ఉగాది రోజున సజీవ సమాధి కావాలని నిర్ణయం
  • గొయ్యిలోకి వెళ్లి పైన రేకు కప్పించి కుమారుడితో మట్టిపోయించుకున్న వైనం
  • విషయం తెలిసి సజీవ సమాధిని అడ్డుకున్న పోలీసులు

సజీవ సమాధికి యత్నించిన వ్యక్తిని ప్రకాశం జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. తాళ్లూరు మండలంలోని విఠలాపురానికి చెందిన మాజీ సర్పంచ్ కైపు అంజిరెడ్డి కుమారుడు కోటిరెడ్డి పన్నెండేళ్ల క్రితం ఊరి శివారులోని తన పొలంలో భూదేవి ఆలయాన్ని నిర్మించాడు. ఇటీవల ఆలయం ముందు పెద్ద గొయ్యి తవ్విన ఆయన వారం రోజులుగా ఆ గొయ్యిలోకి వెళ్లి పైన రేకు కప్పుకొని ధ్యానం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉగాది రోజున సజీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నాడు. నిన్న తెల్లవారుజామున కుమారుడితో కలిసి ఆలయం వద్దకు చేరుకున్నాడు.

ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కోటిరెడ్డి గొయ్యిలోకి దిగి ధ్యానంలో మునిగిపోయాడు. వెంట వెళ్లిన కుమారుడు ఆ గొయ్యిపై రేకు ఉంచి దానిపై మట్టిపోసి పూడ్చేశాడు. విషయం తెలిసిన కోటిరెడ్డి తండ్రి అంజిరెడ్డి గ్రామస్థులతో కలిసి ఆలయం వద్దకు చేరుకుని కుమారుడిని బయటకు రావాలని కోరారు. అయితే, తన ధ్యానానికి ఎవరూ ఆటంకం కలిగించవద్దని కోటిరెడ్డి కోరాడు. మరోవైపు, సజీవ సమాధికి సంబంధించిన సమాచారం అందుకున్న తాళ్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో కోటిరెడ్డిని బయటకు తీశారు. అయితే, వారు వెళ్లిపోయిన తర్వాత మరోమారు ఆయన గోయ్యిలోకి దిగి ధ్యానం చేశాడు. చివరికి కుటుంబ సభ్యులు, స్థానికులు నచ్చజెప్పడంతో మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు.

Kotireddy
Prakasam District
Andhra Pradesh
Live Burial Attempt
Police Intervention
Talur Mandal
Vithalapuram
Spiritual Practice
Meditation
Suicide Prevention
  • Loading...

More Telugu News