Nara Lokesh: 60 రోజుల్లోనే ఎంత మార్పు... ఏసీఏ స్టేడియం మళ్లీ పుట్టినట్టుగా ఉంది: మంత్రి నారా లోకేశ్

Andhra Pradesh Cricket Gets a Boost New ACA Stadium Unveiled
  • ఇవాళ విశాఖలో ఏసీఏ స్టేడియాన్ని సందర్శించిన నారా లోకేశ్
  • జై షాతో కలిసి స్టేడియం అభివృద్ధి పనుల పైలాన్ ఆవిష్కరణ
  • జైషా గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని లోకేశ్ వెల్లడి
ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇవాళ ఐసీసీ చైర్మన్ జై షాతో కలిసి విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనిపై లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు. 

"కేవలం 60 రోజుల్లోనే ఎంత అద్భుతమైన మార్పు! ఏసీఏ-వీడీసీఏ స్టేడియం మళ్లీ పుట్టినట్టుగా ఉంది. ప్రతిభకు, అంకితభావానికి ఇది నిజమైన ప్రతీక. 600 మందికి పైగా కార్మికులు... 8.64 లక్షల పనిగంటలు.. వెరసి ప్రపంచస్థాయి క్రికెట్ వేదిక సాకారమైంది. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ మౌలిక సదుపాయాల బలోపేతానికి అచంచలమైన సహకారం అందిస్తున్న జై షా గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆంధ్రా క్రికెట్ సంఘం కార్యవర్గానికి, అధికారులకు అభినందనలు" అంటూ లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh
ACA-VDCA Stadium
Visakhapatnam
Cricket Stadium
Jay Shah
ICC Chairman
Andhra Pradesh Cricket Association
Stadium Development
Renovation
Cricket Infrastructure

More Telugu News