Chiranjeevi: సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం: చిరంజీవి

- చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో కొత్త చిత్రం
- నేడు ఉగాది సందర్భంగా ప్రారంభోత్సవం
- సోషల్ మీడియాలో స్పందించిన చిరంజీవి
ఇవాళ ఉగాది శుభముహూర్తాన మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో కొత్త చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. దీనిపై చిరంజీవి సోషల్ మీడియాలో స్పందించారు.
ఈ ఉగాది సందర్భంగా అద్భుతమైన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల బృందంతో ప్రయాణాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రియమైన వెంకీ మామా, ఇతర సినీ స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని వెల్లడించారు. సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.