Ram Charan: శ్రీరామనవమి రోజున రామ్ చరణ్ అభిమానులకు ట్రీట్... 'పెద్ది' నుంచి గ్లింప్స్ వీడియో

- రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో పెద్ది
- ఉగాది రోజున చిత్రబృందం నుంచి అప్ డేట్
- ఏప్రిల్ 6న గ్లింప్స్ వీడియో రిలీజ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న చిత్రం పెద్ది. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ భాగస్వామ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఉగాది రోజున ఈ చిత్ర బృందం నుంచి అప్ డేట్ వచ్చింది. చరణ్ అభిమానులకు శ్రీరామనవమి కానుకగా ఏప్రిల్ 6న పెద్ది నుంచి గ్లింప్స్ వీడియో విడుదల చేయనున్నారు.
కాగా, పెద్ది చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ సబ్జెక్టుతో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. పెద్ది సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడం హైలైట్.
