Bangkok Woman: భూకంప భయం.. బ్యాంకాంక్ వీధిలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. వీడియో ఇదిగో!

Woman Gives Birth on Bangkok Street Amidst Earthquake Scare
  • భూకంపం భయంతో ఆసుపత్రులను ఖాళీ చేయించిన సిబ్బంది
  • పక్కనే ఉన్న పార్క్‌లోనై వైద్య సేవలు
  • వీధిలో స్ట్రెచర్‌పైనే పండంటి బాబుకు జన్మనిచ్చిన మహిళ
మయన్మార్, థాయ్‌లాండ్‌లోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేసిన భారీ భూకంపం 1600 మందికిపైగా ప్రాణాలు తీసింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మరోవైపు, మూడు రోజులుగా మయన్మార్‌ను భూకంపాలు భయపెడుతున్నాయి. శుక్రవారం నాటి భూకంపం నేపథ్యంలో బ్యాంకాక్‌లో ఓ ఆసుపత్రిని ఖాళీ చేయించారు. ఈ క్రమంలో ఓ మహిళ వీధిలోనే పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ ఘటన అక్కడి కెమెరాలో రికార్డయింది. భూకంప భయంతో ప్రజలు ఆందోళనతో ఉన్న వేళ, పరిసరాలు భీతావహంగా ఉన్న సమయంలో బాలుడు జన్మించడం గమనార్హం.

పరిసరాలు గందరగోళంగా ఉండగా ఆసుపత్రి స్ట్రెచర్‌పైనే మహిళ ప్రసవించింది. గమనించిన ఆసుపత్రి సిబ్బంది స్ట్రెచర్ చుట్టూ చేరి ఆమెకు అవసరమైన సాయం అందించారు. కాగా, భూకంప భయంతో కింగ్ చులాలాంగ్‌కోర్న్ మెమోరియల్ ఆసుపత్రి, బీఎన్‌హెచ్ ఆసుపత్రిని ఖాళీ చేయించిన సిబ్బంది రోగులను పక్కనే పార్కులోకి తరలించారు. నర్సులు, వైద్యులు అక్కడే రోగులకు చికిత్స అందించారు.  
Bangkok Woman
Earthquake
Myanmar Earthquake
Thailand Earthquake
Childbirth during Earthquake
Bangkok Hospital Evacuation
King Chulalongkorn Memorial Hospital
BNH Hospital
Natural Disaster
Emergency Childbirth

More Telugu News