Donald Trump: గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ను ఆపేసిన అమెరికా... భారతీయులకు భారీ షాక్

US Halts Green Card Processing

  • శరణార్థులతో పాటు మరి కొందరి గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ ఆపేసిన అమెరికా
  • 2023లో గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసిన 51 వేల కంటే ఎక్కువ మంది భారతీయులు
  • అమెరికా నిర్ణయంతో భారీగా నష్టపోనున్న ఇండియన్స్

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని వారిని దేశం నుంచి పంపేస్తున్నారు. వలసదారులను నియంత్రించే కార్యక్రమంలో భాగంగా అమెరికా ప్రభుత్వం మరో చర్య తీసుకుంది. శరణార్థులతో పాటు మరి కొందరి గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ను నిలిపివేసింది. 

శరణార్థులు లేదా ఆశ్రయం పొందిన వారు అమెరికాలో శాశ్వత నివాసం కోసం పెట్టుకున్న అభ్యర్థనలను ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్టు సీబీఎన్ న్యూస్ తెలిపింది. అమెరికా తీసుకున్న నిర్ణయంతో భారతీయులు తీవ్రంగా నష్టపోనున్నారు. 2023లో 51 వేల కంటే ఎక్కువ మంది ఇండియన్స్ గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ను మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయాన్ని అమెరికా వెల్లడించలేదు.

Donald Trump
Green Card
US Immigration
Indian Immigrants
Green Card Processing Halt
US Visa
Immigration Policy
Refugees
  • Loading...

More Telugu News