Kalishetti Appala Naidu: ఉగాది రోజున పొలంలో ఎంపీ కలిశెట్టి ఏరువాక సేద్యం... వీడియో ఇదిగో!

--
ఉగాది పర్వదినం సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక సేద్యం చేపట్టారు. ఉదయం ఆరు గంటలకు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వీఎన్‌పురంలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ఎంపీ.. ఎద్దులు, నాగలిని పూజించారు. అనంతరం నాగలితో భూమిని దున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు సభ్యుడిగా తొలిసారి ఏరువాక నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని రైతులు, ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రైతు కుటుంబాల సంక్షేమం కోసం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మంచి పథకాలు తీసుకు వస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.