Chiranjeevi: చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ఉగాది గ్రీటింగ్స్

- తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఉగాది పండుగ వేడుకలు
- శుభాకాంక్షలు తెలియజేసిన సినీ సెలబ్రిటీలు
- అందరికీ సంతోషం, శాంతి కలగాలని చిరంజీవి ఆకాంక్ష
ఇరు తెలుగు రాష్ట్రాలో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరికీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు అని చిరంజీవి అన్నారు. సుర్య భగవానుడే అధిపతి అయిన ఈ సంవత్సరం అందరి జీవితాల్లో సమృద్ధి, సంతోషం, శాంతి కలగజేయాలని ఆశిస్తున్నానని తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ... మీకు, మీ కుటుంబ సభ్యులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అని తెలిపారు.
'హ్యాపీ ఉగాది. పండుగను కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తున్నా' అని ట్వీట్ చేశారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మీ అందరికీ మంచే జరగాలని కోరుకుంటున్నానని దర్శకుడు బాబీ ఆకాంక్షించారు.