Narendra Modi: మోదీ చాలా తెలివైన నేత: ట్రంప్ కితాబు

Trump Calls Modi a Very Smart Leader

  • భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఆశావహంగా జరుగుతున్నాయన్న ట్రంప్
  • ఏప్రిల్ 2 నుంచి భారత్ పై ప్రతీకార సుంకాలు అమల్లోకి
  • మోదీ తనకు గొప్ప స్నేహితుడని వెల్లడి

ప్రధాని మోదీ అత్యంత తెలివైన నేత అని, తనకు గొప్ప స్నేహితుడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. ఏప్రిల్ 2 నుంచి భారత్‌పై ప్రతీకార సుంకాలు అమల్లోకి రానున్న తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో ఆయన మోదీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఆశాజనకంగా జరుగుతున్నాయని, అవి సత్ఫలితాలు ఇవ్వబోతున్నాయని పేర్కొన్నారు.

అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని, ఇది దారుణం, అత్యంత క్రూరమని ట్రంప్ వ్యాఖ్యానించారు. మోదీ చాలా తెలివైన నేత, తనకు మంచి స్నేహితుడని కితాబిస్తూ తాము కలిసినప్పుడు బాగా మాట్లాడుకుంటున్నామని పేర్కొన్నారు. వాణిజ్య చర్చలు బాగా జరుగుతున్నాయన్నారు.

అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ వాణిజ్య ఒప్పందం కోసం భారత్‌లో పర్యటిస్తుండగా, అమెరికాలో ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రి క్రిస్టోఫర్ లాండాతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ శుక్రవారం చర్చలు జరిపారు. వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ, వలసలపై వారి మధ్య చర్చలు జరిగాయి. 

Narendra Modi
Donald Trump
US-India Trade Talks
Trade Tariffs
India-US Relations
Trump praises Modi
White House
Brendan Lynch
Vikram Misri
Christopher Landau
  • Loading...

More Telugu News