JC Prabhakar Reddy: వైసీపీ నేతలకు హెచ్చరికలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి!

JC Prabhakar Reddy Warns YCP Leaders

  • తాడిపత్రిలో అక్రమ నిర్మాణంపై జాయింట్ కలెక్టర్ శివనారాయణను కలిసిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి
  • వైసీపీ హయాంలో తమను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారన్న జేసీ
  • తాము వైసీపీ నేతల తప్పులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి

వైసీపీ నేతలకు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, సీనియర్ టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమ నిర్మాణంపై నిన్న జాయింట్ కలెక్టర్ (జేసీ) శివనారాయణ శర్మను అనంతపురం కలెక్టరేట్‌లో కలిసి ఫిర్యాదు చేశారు.

అక్రమ నిర్మాణం కూల్చేందుకు 15 రోజులు సమయం ఇస్తున్నానని, ఆ తర్వాత జేసీబీ తీసుకువెళతామని అన్నారు. అనంతరం జేసీ ప్రభాకరరెడ్డి వైసీపీ నేతల తీరుపై మాట్లాడారు. తాము తప్పు చేయకపోయినా వైసీపీ హయాంలో అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని అన్నారు. వైసీపీ నేతల తప్పులపై తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నాలుగు సెంట్ల మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు నిర్మించారని, ఆ ఇల్లు కూల్చవద్దంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు.

ఇదే సమయంలో మాజీ మంత్రి విడదల రజినీపైనా జేసీ వ్యాఖ్యలు చేశారు. పాపం మాజీ మంత్రి రజిని ఎందుకు అంత బాధపడుతోందని అన్నారు. తప్పు చేస్తే జైలుకు వెళ్లి రావమ్మా.. ఏం ఫర్వాలేదు.. తాము కూడా గతంలో జైలుకు వెళ్లి వచ్చామని జేసీ అన్నారు. 

JC Prabhakar Reddy
TDP leader
YCP leaders
Tadipatri
Illegal construction
Anantapur
Ketireddy Peddareddy
Former Minister Rajini
AP Politics
Legal action
  • Loading...

More Telugu News