Chandrababu Naidu: నేను కూడా ఘిబ్లీ ట్రెండ్ లోకి ఎంట్రీ ఇచ్చాను: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Joins Ghibili Trend

  • ట్రెండింగ్ లో ఉన్న ఘిబ్లీ స్టయిల్
  • చాట్ జీపీటీలో ఫేమస్ అవుతున్న ఫీచర్ 
  • పలు ఫొటోలను ఘిబ్లీఫైడ్ చేసిన సీఎం చంద్రబాబు

చాట్ జీపీటీ ఆఫర్ చేస్తున్న ఘిబ్లీ స్టూడియో ఫీచర్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ప్రముఖులు సైతం ఒక్కొక్కరుగా ఘిబ్లీ సాయంతో తమ ఫొటోలను యానిమే స్టయిల్లోకి మార్చుకుంటున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే ఘిబ్లీ గ్యాంగ్ లో చేరానని ప్రకటించగా... తాజాగా తాను కూడా ఎంట్రీ ఇచ్చానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 

ఘిబ్లీ ట్రెండ్ లో చేరుతున్నాను... ఇదిగో నా ఎంట్రీ అంటూ  చంద్రబాబు పలు ఫొటోలను పంచుకున్నారు. కూటమి విజయోత్సవ సభలో తాను, ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్న ఫొటో... తన ఫ్యామిలీ ఫొటో, వరద బాధితుల పరామర్శ ఫొటోను చంద్రబాబు ఘిబ్లీ స్టయిల్లోకి మార్చి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Chandrababu Naidu
Ghibili trend
ChatGPT
Naidu's Ghibili photos
AP Minister Nara Lokesh
Social Media
Anime style photos
Modi
Pawan Kalyan

More Telugu News