Gali Janardhan Reddy: ఎట్టకేలకు ముగిసిన ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణ

Obulapuram Mining Case Hearing Concludes Verdict on May 6

  • 2009లో ఓఎంసీ కేసు నమోదు
  • సుదీర్ఘకాలం పాటు విచారణ జరిపిన సీబీఐ
  • మే 6న తీర్పు వెలువరించనున్న సీబీఐ కోర్టు 

అప్పట్లో సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ కేసులో విచారణ ఎట్టకేలకు ముగిసింది. 2009 డిసెంబరు 7న సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీబీఐ కోర్టు మే 6న తీర్పు వెలువరించనుంది. 

ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్, అలీ ఖాన్, బి.కృపానందం నిందితులుగా ఉన్నారు. ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, ఆమెపై ఉన్న కేసును 2022లో హైకోర్టు కొట్టివేసింది.

ఈ కేసుకు సంబంధించి సీబీఐ 219 మంది సాక్షులను విచారించింది. 3,337 డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకుంది. 2011 డిసెంబరులో సీబీఐ మొదటి చార్జిషీట్ దాఖలు  చేసింది. 9 మంది నిందితులపై 4 చార్జిషీట్లు నమోదు చేసింది. లింగారెడ్డి అనే నిందితుడు కేసు విచారణలో ఉండగా మరణించాడు.

Gali Janardhan Reddy
Obulapuram Mining Case
CBI Court
Mining Scam
Andhra Pradesh
BV Srinivas Reddy
Sabita Indra Reddy
VD Rajagopal
Ali Khan
B. Kripanandam
  • Loading...

More Telugu News