Prabhas: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ టీమ్

- హైదరాబాద్ కు చెందిన అమ్మాయితో ప్రభాస్ పెళ్లి అంటూ వార్తలు
- ఈ వార్తల్లో నిజం లేదన్న ప్రభాస్ టీమ్
- ఏదైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని వెల్లడి
హైదరాబాద్ కు చెందిన అమ్మాయితో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి జరగబోతోందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని... త్వరలోనే పెళ్లి జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' షోలో రామ్ చరణ్ చేసిన కామెంట్స్ ను కూడా నెటిజన్లు దీనికి జత చేస్తున్నారు. గణపవరంకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని ఆ షోలో రామ్ చరణ్ చెప్పిన మాటలు నిజమయ్యాయని... ఏపీకి చెందిన ఆ అమ్మాయి కుటుంబం హైదరాబాద్ లో సెటిల్ అయిందని... ఇరు కుటుంబాలు పెళ్లికి ఓకే చెప్పాయంటూ పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ టీమ్ స్పందించింది.
ప్రభాస్ పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వార్తలను నమ్మొద్దని కోరింది. ఏదైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని తెలిపింది. 45 ఏళ్ల ప్రభాస్ ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు. త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి కూడా ప్రకటించారు. ప్రభాస్ ప్రస్తుతం 'ది రాజాసాబ్', 'ఫౌజీ' సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివర్లో 'స్పిరిట్' సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.