Samantha Ruth Prabhu: సిడ్నీలో మీ ఫొటోలు ఎవరు తీశారన్న అభిమాని... రిప్లయ్ ఇచ్చిన సమంత

ప్రముఖ నటి సమంత ఆస్ట్రేలియా విహారయాత్రకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో వెల్లడించారు. సిడ్నీలోని ఫెదర్‌డేల్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో గడిపిన ఒకరోజులోని విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. సాధారణ దుస్తుల్లో ఎంతో అందంగా ఉన్న సమంత, పార్క్ నుంచి కనిపించే అద్భుతమైన దృశ్యాలను తిలకిస్తూ, అక్కడి అందమైన జంతువులను పరిశీలిస్తూ హాయిగా ఆస్వాదించారు.
ఆమె తన పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. గ్రే కలర్ ఫుల్-స్లీవ్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి, టోపీ పెట్టుకుని వైల్డ్‌లైఫ్ పార్క్‌లో సందడి చేశారు. ఒక చిత్రంలో ఆమె పర్వతాల సుందరమైన దృశ్యాన్ని చూస్తూ కనిపించారు.ఒక కోలా చెట్టు కొమ్మపైకి ఎక్కి ఆసక్తిగా చూస్తుండడాన్ని మరో వీడియోగా రికార్డు చేశారు.. ఈ పోస్ట్‌కు ఫెదర్‌డేల్ సిడ్నీ వైల్డ్‌లైఫ్ పార్క్ అనే ట్యాగ్ జోడించారు.
"ప్రకృతి, జంతువులు, మంచి అనుభూతి! కంగారూలకు ఆహారం ఇవ్వడం నుంచి నిద్రపోయే కోలాలను గుర్తించడం వరకు, ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది! ఆస్ట్రేలియన్ వన్యప్రాణుల కోసం అద్భుతమైన పునరావాస కార్యక్రమాలు చేస్తున్న బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు" అని సమంత కామెంట్ చేశారు.
కాగా, ఈ ఫొటోలను ఎవరూ తీశారంటూ ఓ అభిమాని సమంతను ప్రశ్నిచంగా... ఆమె బదులిచ్చారు. "సిడ్నీ టూర్ గైడ్ నయోమి" అని ఆమె సమాధానమిచ్చారు.
సమంత ఇటీవల 'సిటాడెల్: హనీ బన్నీ'లో వరుణ్ ధావన్‌తో కలిసి నటించారు. ఆమె తదుపరి చిత్రం రాజ్-డీకే దర్శకత్వంలో రూపొందుతున్న 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3'. మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి, జైదీప్ అహ్లావత్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సిరీస్ షూటింగ్ పూర్తయింది. ఈ సంవత్సరం విడుదల కానుంది. రాజ్-డీకే దర్శకత్వంలోనే 'రక్త్ బ్రహ్మాండం: ది బ్లడీ కింగ్‌డమ్' అనే వెబ్ సిరీస్‌లోనూ, తను స్వయంగా నిర్మిస్తున్న 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలోనూ సమంత నటించనున్నారు.